Amaravathi: విజయవాడ-గుంటూరు నగరాలు అమరావతిలో కలిసిపోతాయి.! 10 d ago
గ్రామీణ ప్రాంతాలలో అంతర్గత రహదారులు నిర్మాణం తిరిగి ప్రారంభించామని సీఎం చంద్రబాబు తెలిపారు. సచివాలయంలో రెండో రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. రాజధాని అమరావతి వేగంగా అభివృద్ధి చెందే నగరమని, విజయవాడ-గుంటూరు వంటి నగరాలు అమరావతిలో కలిసిపోతాయన్నారు. పట్టణీకరణ పెరుగుతున్న దృష్ట్యా నిరంతరాయంగా ప్రణాళికలు ఉండాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారు.